సెప్టెంబర్ 10న విడుదల కాబోతున్న ‘లవ్ స్టోరీ’కి పోటీగా నాని ‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఖండించారు. కొద్ది వారాల క్రితమే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కోరింది. కానీ ఆ విజ్ఞప్తిని పక్కన పెట్టి నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేయడంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘లవ్ స్టోరీ’ విడుదల రోజునే ‘టక్…