నాని హీరోగా నటించిన ‘టక్ జగదీశ్’ మూవీ విడుదల సైతం వాయిదా పడింది. ఈ విషయాన్ని నానినే స్వయంగా ఓ వీడియో ద్వారా తెలిపాడు. ఉగాదికి ఈ సినిమా ట్రైలర్ రావడం లేదని, సినిమా కూడా 23 నుండి కాస్తంత వెనక్కి వెళుతోందని స్పష్టం చేశాడు. త్వరలో వచ్చే ట్రైలర్ లోనే సినిమా విడుదల తేదీ ఉంటుందని చెప్పాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. నాని సరసన రీతువర్మ…