Asim Iftikhar Ahmed: ఉగ్రవాదంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి అసిం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన ప్రకటన అంతర్జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో ఒక్క ముస్లిమేతర వ్యక్తి పేరు కూడా లేకపోవడం పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుందని ఆయన అన్నారు. ముస్లింలను ఏకపక్షంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని, ప్రపంచవ్యాప్తంగా ముస్లిమేతర తీవ్రవాదులు ఉగ్రవాదం, మౌలికవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. కానీ వారిని ఉగ్రవాదులుగా గుర్తించడాన్ని విస్మరిస్తున్నారని సంచలన వ్యాక్యలు చేశారు. ఇది నిజమైన ఉగ్రవాదానికి…