తిరుమలలో శిలువ గుర్తు కలకలం రేపుతోంది. ఇండికా కారుపై శిలువ గుర్తును గమనించకుండా… తిరుమలకు అనుమతిచ్చారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. తనిఖీ సమయంలో కారును క్షుణంగా తనిఖీ చేయలేదు విజిలెన్స్ సిబ్బంది. అయితే కారు వెనుక అద్దంలో ”శిలువ గుర్తు., ave Maria’’ అనే అన్యమత శ్లోకంతో తిరుమలకు వచ్చింది కారు. వారు తెలంగాణకు చెందిన భక్తులుగా గుర్తించిన తిరుమల విజిలెన్స్ సిబ్బంది అనంతరం శిలువ గుర్తును తొలగించి కారును భక్తులకు అప్పగించారు విజిలెన్స్ అధికారులు. అయితే…
విశాఖ రుషికొండపై టీటీడీ నిర్మించిన ఈ ఆలయం ఏడు కొండలవాడి వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఘాట్ రోడ్డు, మెట్ల మార్గం.. ఇవన్నీ చూస్తే మరో తిరుమలలా అనిపిస్తుంది. భీమిలి బీచ్ రోడ్డును ఆనుకుని కొండపై 10 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించింది టీటీడీ. ఆలయ నిర్మాణం, ఘాట్ రోడ్డు, ఇతరత్రా సదుపాయాల నిమిత్తం సుమారు 28 కోట్లు నిధులు ఖర్చు చేసింది. ఇప్పుడీ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అచ్చం తిరుమల ఆలయం మాదిరే.. విశాఖలోనూ వేంకటేశ్వరుడి…
ఇటీవలే టిటిడి చైర్మన్ పదవి బాధ్యతలను.. వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి జగన్ సర్కార్ అప్పగించిన సంగతి తెలిసిందే. మొన్నటి నామినేటెడ్ పదవుల్లో భాగంగా… వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి దక్కింది. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇవాళ టిటిడి చైర్మన్ గా భాధ్యతలు స్వీకరించనున్నారు వైవి సుబ్బారెడ్డి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు టీటీడీ అధికారులు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో…
టీటీడీ బోర్డు చైర్మన్ గా మరోసారి తనకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు వైవి సుబ్బారెడ్డి. తాజాగా ఎన్టీవీతో మాట్లాడినా ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అదృష్టం అందరికి రాదు. నాకు మరోసారి చ్చినందుకు సంతోషిస్తున్న. బోర్డు చైర్మన్ పదవి తీసుకోవడంలో నాకు అసంతృప్తి లేదు. ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనటం సాధ్యం కావడం లేదనేది నిజమే. భవిష్యత్ లో ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగుతా.. టీటీడీలో గతంలో…
టీటీడీ బోర్డు చైర్మన్గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు సీఎం వైఎస్ జగన్… దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అదృష్టం అందరికి రాదు.. నాకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నానన్న ఆయన.. బోర్డు చైర్మన్ పదవి తీసుకోవడంలో నాకు అసంతృప్తి లేదన్నారు. ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనటం సాధ్యం కావడం లేదనేది నిజమే.. కానీ, భవిష్యత్…
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం ముగిసింది. తిరుమలను కాలుష్య రహిత క్షేత్రంగా మార్చేందుకు 35 ఎలక్ట్రికల్ వాహనాలను డ్రైలీజ్ కు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 2022 సంవత్సరానికి సంబంధించి త్రిదండి చినజీయర్ స్వామి ప్రతిపాదనలకు సంబంధించి 10 ఆలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు నుండి రూ.9 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటి వరకు రూ.150 కోట్లు విరాళంగా అందింది. శ్రీవాణి ట్రస్టు దర్శనాలకు వీఐపీ బ్రేక్ దర్శనాల్లో ప్రియారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు…
నిన్న తిరుమల శ్రీవారిని 17073 మంది భక్తులు దర్శించుకోగా 8488 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 1.7 కోట్లు. అయితే నేటి నుండి ఆన్ లైన్ లో ఆగష్టు మాసంకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల టీటీడీ విడుదల చేయనుంది. రోజుకి 5 వేల చోప్పున టీటీడీ టికెట్లను విడుదల చేయనుంది. అయితే ఏపీలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టిన దర్శనాల టికెట్ల సంఖ్యను మాత్రం టీటీడీ పెంచలేదు. ఇక…
తిరుమలలో జరుగుతున్న అసత్యప్రచారాలపై అధికారులు అప్రమత్తం అయ్యారు. టీటీడీపై నిరాధరమైన ఆరోపణలు చేస్తూన్న వారిపై విజిలెన్స్ అధికారులు కోరడా ఝూలిపిస్తున్నారు. టీటీడీ నిర్వహిస్తున్న కౌంటర్లు ప్రైవేటీకరణ చేస్తారంటూ.. కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగిందంటూ నిరాధరమైన ఆరోపణలు చేసిన వారిపై విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి, ఓ ప్రముఖ ఆన్ లైన్ యూట్యూబ్ ఛానల్ ఎడిటర్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలాంటి ఫేక్ వార్తలపై…