ఒకవైపు వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలతో తిరుమల వెళ్ళే భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. గురువారం రాత్రి 8 గంటలకు రెండు ఘాట్ రోడ్ల మూసివేస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ. తిరిగి రేపు ఉదయం 6 గంటల నుంచి వాహనాలను ఘాట్ రోడ్డు లో అనుమతి ఇస్తామని ప్రకటించింది. ఘాట్ రోడ్డులో పలు ప్రాంతాలు కొండచరియలు విరిగిపడుతుండడంతో ముందస్తు జాగ్రత్తగా మొదటి ఘాట్ రోడ్డు మూసివేస్తోంది టీటీడీ. తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే భక్తులు 7 గంటలలోపు ప్రయాణం చెయ్యాలని విజ్ఞప్తి…