TTD Operation Cheetah successfully completed: తిరుమల శేషాచలం కొండల్లో ‘ఆపరేషన్ చిరుత’ విజయవంతంగా ముగిసింది. గత వారం రోజులుగా తప్పించుకుంటూ తిరుగుతున్న చిరుత.. ఎట్టకేలకు ఆదివారం (ఆగష్టు 27) రాత్రి బోనులో చిక్కింది. దాంతో అలిపిరి కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు ఊరట లభించింది. బోనులో చిక్కిన చిరుతను తిరుపతి జూపార్క్‌కు తరలించినట్లు అటవీశాఖ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ (సీసీఎఫ్‌వో) తెలిపారు. చిరుత రక్త నమూనాలు సేకరించి.. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గత కొన్నిరోజులుగా…