రేపటి నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిన్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించి, ఆ తరువాత కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు.