టీటీడీలో సంస్కరణలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏకంగా సీఎం చంద్రబాబు టీటీడీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోవు 50 సంవత్సరాలకు అనుగుణంగా భక్తులకు కల్పించే సౌకర్యాలపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం..
తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోపై సీరియస్ అయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, తొక్కిసలాట జరిగే ప్రమాదముందని తెలిసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని ప్రశ్నించారు. మీ ప్లానింగ్ ఏంటి.. భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని ముఖ్యమంత్రి నిలదీశారు.
టీటీడీ అధికారులుతో వరుస సమావేశాలు నిర్వహించారు ఈవో జవహర్ రెడ్డి. అయితే విపత్తు సమయంలో భక్తులకు ముందస్తు సూచనలు చేసేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చెయ్యాలి అని జవహర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ మధ్యే తిరుపతిలో వచ్చిన వరదల గురించి అందరికి తెలిసిందే. ఆ వరదల వల్ల భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇక ఈ వరదల్లో పాడైన ఘాట్ రోడ్లు ,శ్రీవారి మెట్టు నడకమార్గంలో మరమత్తు పనులు వేగవంతంగా నిర్వహించాలి…