ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. 2023, డిసెంబర్ నెలలో జరిగే ఉత్సవ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి రేపు(నవంబర్ 24) ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చెయ్యనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది టీటీడీ. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి ప్రకటన చేసింది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.