7.1 తీవ్రతతో బలమైన భూకంపం ఫిలిప్పీన్స్‌ను తాకింది.. ఫిలిప్పీన్స్ ఆగ్నేయ తీరం మిండనోవాలో ఈ భారీ భూకంపం సంభవించింది.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది… పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరం, భూమికి 65.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.. ఇంత భారీ తీవ్రతతో భూకంపాలు వచ్చినప్పుడు.. సాధారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు.. కానీ, దానికి విరుద్ధంగా ఎలాంటి సునామీ ప్రమాదం లేదని వివిధ ఏజెన్సీలు…