ఉత్సాహం ఉండాలి, కానీ అత్యుత్సాహం ఉండకూడదు. ఏం కాదులే అని ఆ అత్యుత్సాహాన్ని ఎక్కడిపడితే అక్కడ ప్రదర్శిస్తే మాత్రం.. బాక్స్ బద్దలవ్వడం ఖాయం! ఇప్పుడు నెదర్లాండ్స్ రాయబారి కారెల్ వాన్ ఓస్టెరోయ్ విషయంలోనూ అదే జరిగింది. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో భారతదేశానికి సలహా ఇవ్వబోయి, గట్టి ఎదురుదెబ్బని ఎదుర్కొన్నాయన! దీంతో, మరో దారి లేక ఆయన వెంటనే వెనకడుగు వేయాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, సాధారణ…