బీజేపీ మంత్రిని పట్టపగలు కాల్చిచంపిన దుండగులు.. ఉత్తరప్రదేశ్లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. జౌన్‌పూర్‌లోని సిక్రారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధాపూర్ గ్రామంలో గురువారం బీజేపీ జిల్లా మంత్రి ప్రమోద్ కుమార్ యాదవ్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బోధాపూర్‌లో నివాసముంటున్న మంత్రి ప్రమోద్‌కుమార్ యాదవ్ రోజూ ఉదయం జిల్లా కేంద్రానికి పని నిమిత్తం వస్తుంటారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సిటీ) బ్రిజేష్ కుమార్ తెలిపారు.…
తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. మార్చి 18 నుండి ఏప్రిల్ రెండు వరకు 10 వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుండి మధ్యా్హ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ భాష (కాంపోజిట్ కోర్సు) ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.50 గంటల వరకు ఉంటుంది.…