ఆర్టీసీ గౌరవంగా ఇచ్చే జీతభత్యాలు వద్దన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. అయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ సంస్థ నుండి ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. శాసనసభ సభ్యునిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలునని, టీఎస్ ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్థిక భారం మోపడం ఇష్టం లేక తన వంతుగా ఈ నిర్ణయం తీసుకునట్లు తెలియజేసారు. అయితే చైర్మన్ బాజిరెడ్డి టీఎస్…
అదో ఆర్టీసీ బస్సు.. కానీ ఒకే నెంబర్‌తో మూడు బస్సులు ఉన్నాయి. ఈ విషయం ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించే వరకు బయటికి రాలేదు. తెలంగాణ ఆర్టీసీలో ఒకే నెంబర్‌తో మూడు బస్సులు ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. గరుడప్లస్, సూపర్‌లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, ఈ మూడు బస్సులకు ఒకే నెంబర్ ఉంది. ఆ మూడు బస్సులపై ఫైన్లు కూడా ఉన్నాయి. హైదరాబాద్ వన్ డిపోలో టీఎస్ 08 z 0208 ఉన్న బస్సు ఎక్స్‌ప్రెస్ సర్వీసుగా నడుస్తుంది.…
నూతనంగా ఆర్టీసీ ఎండీ బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ శాఖ లో తీసుకున్న తరహాలోనే… ఆర్టీసీలోనూ తనదైన మార్క్ చూపిస్తున్నారు సజ్జనార్. ఆర్టీసీ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఇక గతంలో వివాహాది వేడుకలకు ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకోవాలంటే ముందుగా డిపాజిట్ చేయాల్సి ఉండేది. దీని కారణంగా చాలా మంది వెనకడుగు వేసే వాళ్లు. అయితే.. తాజాగా ఆ డిపాజిట్ లేకుండా బస్సులను బుక్ చేసుకునే…
తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్లు వస్తున్న వార్తలపై టి.ఎస్.ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఇక ముందు తెలంగాణ రాష్ట్రంలో అదనపు ఛార్జీలు ఉండవని తెల్చి చెప్పారు. గడిచిన 5 రోజుల్లనే 1.3కోట్ల మంది ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు ఆర్టీసీ చేర్చిందని… దీనిపై తనకు చాలా సంతోషంగా ఉందన్నారు సజ్జనార్. టి.ఎస్.ఆర్టీసీని ప్రయాణీకులు ఆదరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని… ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్న ప్రయాణిక దేవుళ్ళందరికి వందనాలు అని చెప్పారు. ఎటువంటి…
నష్టాల్లో కూరుకుపోతున్న టీఎస్‌ఆర్టీసీని గాడిలోపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇక, ఆ తర్వాత మూడు, నాలుగు నెలల్లో ఆర్టీసీ కోలుకోకపోతే.. ప్రైవేట్‌పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారంటూ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.. సంస్థ బాగుకోసం అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇక, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా రంగంలోకి దిగారు.. ఇప్పటికే…
చాలా కాలం తర్వాత తెలంగాణ ఆర్టీసీకి కళ వచ్చింది. ఛైర్మన్, పూర్తిస్థాయి ఎండీ రాకే దానికి కారణం. కష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కిస్తారని అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బస్‌భవన్. దాని గురించే ప్రస్తుతం సంస్థలో పెద్ద టాక్ నడుస్తోంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. బస్‌భవన్‌పై టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల్లో చర్చ..! TSRTCలో దాదాపు మూడేళ్లపాటు ఇంచార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ సారథ్యంలో పరిపాలన సాగింది. ఛైర్మన్ పదవి ఖాళీగా…
వీసీ సజ్జనార్. అది పేరు కాదు. బ్రాండ్. మహిళలను వేధించే వారి ప్రాణం తీసే బ్యాండ్. పోలీస్ పవర్ కు ఆ పేరు కేరాఫ్. నేషనల్ లెవల్లో కాదు.. ఇంటర్నేషనల్ లెవల్లో రాష్ట్ర పోలీసుల ప్రతాపాన్ని మార్మోగించిన వ్యక్తి ఆయన. ఇంతటి పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్.. కీలక ఆపరేషన్లను సమర్థంగా నిర్వహించిన పేరున్న అధికారి.. ఇప్పుడు టీఎస్ఆర్టీసీకి బాస్ అయ్యారు. ఎండీగా ఇవాళే బాధ్యతలు తీసుకున్నారు. పోలీస్ అధికారిగా దూకుడుగా పని చేసిన ఆయన.. ఇప్పుడు…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీపీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్ లో శుక్రవారం సజ్జనార్ ఎండీ గా బాధ్యతలు చేపట్టారు. సజ్జనార్ అంతకు ముందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల పాటు సైబరాబాద్ సీపీగా పని చేసి.. నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009 లో దేశం లోనే సంచలనం…