తెలంగాణ టీఆర్‌ఎస్ కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆందోళన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం గతంలో ఉద్యమంలా ఎలా వచ్చారో, ఇప్పుడు కూడా రైతుల కోసం అలాగే వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. నేడు రైతుల పోరాటం న్యాయమైన పోరాటమని, ఈ పోరాటంలో రైతులు గెలుస్తారు అని ఆయన జోస్యం చెప్పారు.…
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ నేడు టీఆర్‌ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపత్యంలో వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులంతా సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు నీళ్లు, కరెంట్, రైతు బంధు ఇచ్చాము.. వడ్లు కొనలేమని కేసీఆర్ ముందే చెప్పారన్నారు. యాసంగి వడ్లు కొనకుండా కేంద్రం నటకాలాడుతోందని, రైతులను వరి వేయండి,…