ఏపీలో టెన్త్ పేపర్ల లీకులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తప్పదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవలే ఇంటర్ పరీక్షల్లో సంస్కృతం ప్రశ్నాపత్రానికి బదులుగా కెమిస్ట్రీ ప్రశ్నాపత్రాలను సూర్యాపేటలో విద్యార్థులకు ఇచ్చారు. తీరా పరీక్ష రాసేందుకు సిద్దమైన విద్యార్థులు సంస్కృతంకు బదులు కెమిస్ట్రీ పేపర్ చూసి షాక్‌కు గురయ్యారు. దీంతో గంటన్నర ఆలస్యంగా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే.. నేడు మరో పొరపాటును చేసింది ఇంటర్…
తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్ అందించింది ఇంటర్ బోర్డు. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన పరీక్షల ఫీజు గడువును ఈనెల 21వరకూ పొడిగించింది. ఈనెల 21 వరకూ 5వేల రూపాయల అపరాధ రుసుముతో దరఖాస్తులు చేసుకోవచ్చు. గతంలో తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ముందుగానే ప్రకటించింది. ఆ తర్వాత జేఈఈ పరీక్షల తేదీలు వచ్చాయి. దీంతో తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలతో క్లాష్ కావడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్ష తేదీలను సవరించింది. ఇంటర్ బోర్డు (Telangana…
తెలంగాణలో గతంలో ప్రకటించిన ఇంటర్ పరీక్షల తేదీలు మారిపోయాయి.. జేఈఈ మెయిన్ ఎంట్రెన్స్ 2022 తేదీలు మారడంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మార్చనున్నట్టు.. నేడో.. రేపో కొత్త షెడ్యూల్ వస్తుందంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటించింది ఇంటర్ బోర్డు.. ఇక, ఏప్రిల్ 22 నుండి జరగాల్సిన పరీక్షలు… మే 6 నుండి ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు.. తెలంగాణలో మే 6వ…
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మారబోతోంది.. జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు రీ షెడ్యూల్ కావడంతో.. ఆ ప్రభావం తెలంగాణలో జరగనున్న ఇంటర్ పరీక్షలపై పడినట్టు వెల్లడించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై ఇవాళ లేదా రేపు స్పష్టత వస్తుందని తెలిపారు. జేఈఈ షెడ్యూల్ మారిన కారణంగా.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా మార్చక తప్పని పరిస్థితి వచ్చిందని వెల్లడించారు మంత్రి సబిత.. కాగా.. జేఈఈ మెయిన్ మొదటి విడత…