ఓట్ల లెక్కింపు సమయంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ ఎప్పటికప్పుడు స్పెషల్ బ్రాంచ్‌కు తెలియజేయాలని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు మొత్తం రెడీ అయింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గానూ కాసేపట్లో ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. ఓట్ల లెక్కింపుకు అధికార యంత్రాంగం అన్ని సిద్ధం చేసింది.