నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. అక్కడ చిన్నమల్లారెడ్డి, రాజంపేట, బిక్నూర్ కార్నర్ మీటింగుల్లో ఆయన పాల్గొననున్నారు.
నేడు సీఎం కేసీఆర్ చేర్యాలలో పర్యటించబోతున్నారు. అక్కడ గులాబీ పార్టీ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొంటారు. ఇక, ఇవాళ సీఎం కేసీఆర్ కేవలం ఒకే ఒక సభలో పాల్గొంటారు.
తెలంగాణ పాలనా వ్యవస్థపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. భారీగా పలు శాఖల ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా బదిలీ వేటు వేసినట్లు తెలిసింది.