Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు పేకమేడలా కుప్పకూలిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపు, పీస్ బోర్డులో చేరకూడదని ఫ్రాన్స్ పట్టుబట్టడం ప్రపంచ స్టాక్ మార్కెట్లలో మరోసారి క్షీణతకు దారితీశాయి. భారత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 1,073.91 పాయింట్లకు పైగా పడిపోయింది. సెన్సెక్స్ వరుసగా రెండు రోజులు 1,300 పాయింట్లకు పైగా పడిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు మంగళవారం ఒక రోజులే రూ.9 లక్షల కోట్లకు…