ట్రంప్ ప్లాన్‌పై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే నరకం చూస్తారని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఎట్టకేలకు హమాస్ దిగొచ్చింది. ట్రంప్ ప్రణాళికకు అంగీకారం తెలిపింది.
గాజాలో శాంతి ఒప్పందానికి ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళికను హమాస్ ఉగ్రవాదులకు అందజేశారు. ఈ ప్రణాళిక అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు.