రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణపై త్వరలోనే రష్యా-ఉక్రెయిన్ చర్చలు ప్రారంభిస్తాయని ప్రకటించారు.
గత మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. ఇరు దేశాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేందుకు అమెరికా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.