వివిధ పాలనా, సాంకేతిక పరమయిన కారణాల వల్ల ఆగిపోయిన ట్రూజెట్ విమాన సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈనెల 5 వ తేదీ నుంచి ట్రూజెట్ సర్వీసులు తాత్కాలికంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సర్వీసులు తిరిగి ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషంగా వుందని కంపెనీ వెల్లడించింది. ఈనెల 23వ తేదీ బుధవారం నుంచి వివిధ సెక్టార్లలో సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తెలిపింది. హైదరాబాద్-విద్యానగర్-హైదరాబాద్ విద్యానగర్-బెంగళూరు-విద్యానగర్ బెంగళూరు-బీదర్-బెంగళూరు హైదరాబాద్-రాజమండ్రి-హైదరాబాద్ హైదరాబాద్-నాందేడ్-హైదరాబాద్ ముంబై-నాందేడ్-ముంబై ముంబై-కొల్హాపూర్-ముంబై ముంబై-జలగావ్-ముంబైఈ రూట్లలో ట్రూజెట్…