ఈయన ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య. ఈయనేమో అదే జిల్లా జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్. అధికార టీఆర్ఎస్ నాయకుడు. జిల్లా అభివృద్ధిలో కలిసి సాగాల్సిన ఈ ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉంది పరిస్థితి. ముఖ్యంగా కలెక్టర్ తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో రెండు వర్గాల నుంచి పోటాపోటీగా లేఖలు బయటకు వచ్చి దుమారం రేపుతున్నాయి. ఆ మధ్య జిల్లాలో ప్రతిపక్ష నేతలకు ఇచ్చిన విలువ అధికారపార్టీ నేతలమైన…