తెలంగాణలో వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరలు పెరుగుతుంటే మోడీ ఆనాడు ట్వీట్ పెట్టారు, రోడ్లు ఎక్కి ఆందోళన చేశారని ఆయన గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ చాతనవడం లేదు దిగి పొమ్మని మోడీ మాట్లాడారని, ఇప్పుడు ప్రశ్నిస్తే దేశ ద్రోహివి అంటూ నోటికొచ్చే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రష్యా యుద్ధం పేరు చెప్పి ఆయిల్…
కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పద్మానాయక ఫంక్షన్ హల్ లో కేంద్రం వడ్లు కొనేందుకు టీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నియోజకవర్గ స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ. అనంతరం పలువురు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. కేంద్రం ఎఫ్…
ఈ నెల 21న సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరపాలని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని…
కేంద్రంపై మరో పోరాటానికి రెడీ అవుతోంది టీఆర్ఎస్ పార్టీ… పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దూకుడు పెంచాలని అధిష్టానం నిర్ణయించింది. కేంద్ర వైఖరిపై గట్టిగా పోరాడాలని సిగ్నల్స్ రావడంతో… ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టారు టీఆర్ఎస్ ఎంపీలు. ఈ నెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి... దాంతో గులాబీ పార్టీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు మొదలుపెట్టింది. విభజన చట్టం అమలు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై పార్లమెంట్ వేదికగా…
సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్‌కు గురై ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే… కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ శుక్రవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ వద్ద టీఆర్ఎస్ ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీ కడుతుండగా బంజారా కాలనీకి చెందిన కందుకూరి సునీల్ (23) అనే యువకుడు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే…