టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు టీఆర్ఎస్ 21వ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి ఒక విజనరీ కావాలి టెలివిజనరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. భారత దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని, మతపిచ్చి- కులపిచ్చి లేకుండా తెలంగాణకు గోల్డెన్ పాలన కేసీఆర్ అందిస్తున్నారన్నారు. దేశ ప్రజల కష్టాలను డబుల్ చేసిన ఘనత మోడీకే దక్కుతుందని, నరేంద్రమోదీ- రైతు విరోధి అంటూ ఆయన మండిపడ్డారు. నల్లధనం అని అడిగితే మోడీ తెల్లమొకం…