యాసంగిలో వరి ధాన్యం సేకరణపై స్పష్టతను ఇవ్వాలని లోక్‌సభలో ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు సమావేశాల్లో కేంద్రం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. జాతీయ ధాన్యం సేకరణ విధానం, మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం అయిన వెంటనే కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. టీఆర్‌ఎస్ ఎంపీల…
రైతు సమస్యలపై పార్లమెంట్ లోపల, బయట ఆందోళన చేస్తూ వస్తోంది టీఆర్ఎస్ పార్టీ… ముఖ్యంగా తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది.. ఇక, తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఉభయసభల నుంచి ఇవాళ వాకౌట్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇవాళ ఆరో రోజు కూడా ఉభయ సభల్లో ఆందోళన కొనసాగించారు టీఆర్ఎస్ ఎంపీలు.. లోకసభలో స్పీకర్ పోడియాన్ని…