టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ పెద్దలకు నివేదికలు అందాయా? ఆ రిపోర్ట్‌ల ఆధారంగా కొందరు శాసనసభ్యులను పిలిచి మాట్లాడారా? హితబోధ చేశారా.. లేక క్లాస్ తీసుకున్నారా? దిద్దుబాటు చేసుకోలేని ఎమ్మెల్యేలు సర్దుకోవాల్సిందేనా? గులాబీ శిబిరంలో ఉత్కంఠ రేపుతున్న నివేదికలేంటి? ఎమ్మెల్యేల పనితీరుపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్న టీఆర్‌ఎస్‌తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. క్రమంగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్తోంది పార్టీ. దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వారి పనితీరు ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు?…