బీహార్ రాష్ట్రంలో ట్రిపుల్ మర్డర్ కేసు సంచలనంగా మారింది. తమను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు యువతి తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ హత్యకు ఆమె సోదరుడు సహకరించాడు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని భాగల్‌పూర్ జిల్లాలో భార్యభర్తలను, వారి రెండేళ్ల చిన్నారిని యువతి తండ్రి, అన్న కలిసి హత్య చేశారు.