అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామన్నారు. అనంతరం…
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు యావత్ సినీ పరిశ్రమ నివాళి అర్పిస్తోంది. శాండల్ వుడ్ కన్నీరు మున్నీరు అవుతోంది. పునీత్‌కి తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధం వుంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, హీరో శ్రీకాంత్, ఆలీ, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తదితరులు పునీత్ పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కన్నీరు ఆపుకోలేకపోయారు. పక్కనే ఉన్న పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ను…