Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో టెర్రరిస్టులకు సహకరించిన స్థానిక కాశ్మీర్ వ్యక్తులను అధికారులు గుర్తిస్తున్నారు. పహల్గామ్ బైసరన్ లోయలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల్ని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన 5 నెలల తర్వాత, భద్రతా సంస్థలు బుధవారం ఉగ్రవాదులకు లాజిస్టిక్ మద్దతు ఇచ్చిన కాశ్మీర్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కుల్గాం నివాసి అయిన 26 ఏళ్ల మహ్మద్ యూసుఫ్ కటారియాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని 14…