వలసపాలన అవశేషమైన 124(ఎ) సెక్షన్ రాజద్రోహం కేసులు ఇంకా కొనసాగడం ఏమిటని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనవార్తగా ప్రచారమవుతున్నది. గాంధీ తిలక్ వంటి జాతీయ నాయకులను శిక్షించేందుకు బ్రిటిష్ వారు తెచ్చిన ఈ సెక్షన్లు 75ఏళ్ల స్వాతంత్రం తర్వాతా దేనికని సిజె రమణ మాజీ మేజర్ జనరల్ వోంబట్కరే దాని రద్దుకోసం దాఖలు చేసిన కేసు సందర్భంగా ప్రశ్నించారు. 1890నాటి రాజద్రోహచట్టం, 1910లో బ్రిటిష్‌పత్రికా చట్టం 1917లో రౌలట్ చట్టం,1928 ప్రజాభద్రతా చట్టం…