కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పిస్తామని బురిడీ కొట్టించే వారు రోజుకొకరు పెరిగిపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు భాద్యతలు చేపట్టిన సమయం నుంచి అధికారులు కేటుగాళ్ల భరతం పడుతున్నారు. భక్తుల ఫిర్యాదుల మేరకు అనతి కాలంలోనే పలువురిని విజిలెన్స్ పోలీసులు పట్టుకున్నారు. టీటీడీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేటుగాళ్లు మాత్రం భక్తుల అమయాకత్వాన్ని క్యాష్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా శ్రీవారి దర్శనం పేరిట భక్తులను మోసం చేసిన ఘటన…