Ponnam Prabhakar: కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.. బస్సులను రోజూ తనిఖీ చేస్తుంటే వేధింపులు అంటున్నారని చెప్పారు.. ఏపీ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని.. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ల సమావేశం నిర్వహిస్తామన్నారు.