ఈ ఏడాది స్మార్ట్ సిటీ మిషన్‌ను పూర్తి చేసే పనిలో నిమగ్నమైన పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. పథకంలో పొందుపరిచిన నగరాల్లోని సీఈవోలను పదే పదే బదిలీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. వారికి నిర్ణీత పదవీకాలాన్ని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం మళ్లీ రాష్ట్రాలను కోరింది.