కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా తీవ్ర విమర్శలు చేశారు. దేశ ద్రోహి భావజాలం కలిగి ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందన్నారు. దేశానికి వ్యవతిరేకంగా పని చేయడమే ఆ పార్టీ ఒక పనిగా పెట్టుకుందని ఆరోపించారు.