మావోయిస్టులు తమ ప్రతాపం చూపుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. గతంలో జేసీబీలు, రోడ్ల నిర్మాణం చేపట్టే యంత్రాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు తాజాగా గూడ్స్ రైలుని టార్గెట్ చేశారు. ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా బచేలి-భాన్సీ మార్గం మధ్యలో విశాఖపట్నం వైపు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును మావోయిస్టులు అడ్డగించారు. సుమారు 20 మంది సాయుధ నక్సలైట్లు రంగంలోకి దిగి గూడ్స్ రైలును నిలిపివేశారని, ఇంజిన్‌కు…