ట్రాఫిక్ బాగా పెరిగిపోతోంది. రోడ్ల మీదకి వెళ్ళి ప్రయాణాలు చేయడం కష్టంగా మారింది. ప్రపంచంలో జనాభా ఎక్కువగా వుండే దేశాల్లో అయితే బహుళ ప్రయోజనకర వాహనాలు తెరమీదకు వస్తున్నాయి. నీటిలో, నేలపై నడిచే కార్లు అన్నమాట. ఇప్పుడు పట్టాలపై నడుస్తూ.. అవసరమయితే రోడ్లమీద పరుగులు పెట్టే రైల్ కం బస్సుల ఆవశ్యకత ఎంతో వుంది. ప్రపంచంలోనే తొలి రైలును పోలిన బస్సు తెరమీదకు వచ్చింది. దీనిని డ్యూయల్ మోడ్ వాహనం అండే డీఎంవీ అనవచ్చన్నమాట. డీఎంవీ ఒక మినీ బస్సు, మినీ రైలు మాదిరిగా పనిచేస్తుంది.
సాధారణ రబ్బరు టైర్లతో సంప్రదాయ రోడ్లపై నడుస్తుంది. అంతేకాదు రైలు పట్టాలపై కూడా అచ్చం రైలులాగా వేగంగా పరుగులు తీస్తుంది. ఇంటర్‌చేంజ్ స్టేషన్‌లలో యాక్టివేట్ అయ్యే స్టీల్ వీల్స్‌ను ఈ వాహనం కలిగి ఉంటుంది. అంటే రోడ్ల మీద నడిచే టప్పుడు టైర్లు పనిచేస్తాయి. రైలు పట్టాలపైకి వచ్చినప్పుడు రైలుకి వున్న స్టీల్ వీల్స్ యాక్టివేట్ అయి, టైర్లు కాస్త పైకి వెళ్తాయి. ప్రపంచంలోనే తొలిసారి జపాన్‌లోని కైయో నగరంలో క్రిస్మస్ రోజున ప్రారంభించారు.
ఈ డీఎంవీ రోడ్డుపై, పట్టాలపై వేగంగా నడుస్తుంది. రైలు పట్టాలపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో, రోడ్డుపై వంద కిలోమీటర్లకుపైగా వేగంతో ఇది ప్రయాణిస్తుందని జపాన్‌కు చెందిన ఆసా కోస్ట్ రైల్వే వెల్లడించింది. డీజిల్‌తో నడిచే ఈ రైలు కమ్ బస్సులో 20మంది వరకూ ప్రయాణం చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు రవాణా సదుపాయాన్ని అందించడంలో ఇది ఎంతో ఉపయోగపడనుంది.
బస్టాండ్లలో ప్రయాణికులను ఎక్కించుకోవడం, వారిని వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది. అంతేకాదు, వీరిని రైల్వే స్టేషన్లకు కూడా చేరవేస్తుంది. పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందంటోంది జపాన్ రైల్వే సంస్థ. భారత దేశానికి ఇలాంటి డీఎంవీ ఎంతగానో ఉపయోగపడనుంది. టూరిజం కూడా ఇలాంటి వాహనాల వల్ల అభివృద్ధి చెందుతుంది.