Traffic restrictions: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం రేపు ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా హైదరాబాద్, పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
విజయవాలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం హాజరుకానుంది.
రంజాన్ మాసం ముస్లిములకు ప్రవిత్రమైన మాసం. రంజాన్ సందర్బంగా.. తెలంగాణ సర్కార్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ రాత్రి 11.30 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ తో పాటు వరంగల్ రహదారిపై కూడా పోలీసులు ట్రాపిక్ ఆంక్షలు పెట్టారు. పలు మార్గాల్లో మధ్యాహ్నం ట్రాఫిక్ మళ్లీంచనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం, అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.
శ్రీరామ నవమి శోభా యాత్ర నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయని తెలిపారు.
Global Investors’ Summit: ఆంప్రదేశ్కు భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం.. ఈ సమ్మిట్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, కార్పొరేట్ దిగ్గజాలు విశాఖ చేరుకుంటున్నాయి.. నిన్న ఒక్క రోజే నాలుగు వేలకుపైగా రిజిస్ట్రేషన్స్ నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 12,000కిపైగా నమోదు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు విశాఖ నగరం ఆతిథ్యం ఇచ్చేందుకు…