తెలంగాణలో రాజకీయాలు దళిత, గిరిజనుల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇంద్రవెల్లి ఘటన సాక్ష్యంగా దళిత, గిరిజన దండోర సభ నిర్వహించింది. దీనికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌కూ అన్యాయం జరిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు. అమరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌దేనని హామీ ఇచ్చారు. తెలంగాణకు ఎస్సీ నేతను తొలి సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ఎస్సీని ఉప ముఖ్యమంత్రిని చేసి రెణ్నెళ్లకే తొలగించారన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు…