తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రేపు (గురువారం) ఖమ్మం జిల్లాకు వెళ్లనున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు సందర్భంగా వచ్చే నెల 2వ తారీఖున ఇక్కడ సభ నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నాయి.