Toyota Hilux ANCAP 5 Star: ప్రపంచవ్యాప్తంగా నమ్మకమైన పికప్ ట్రక్‌గా పేరుగాంచిన టయోటా హైలక్స్ మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈసారి భద్రత విషయంలో మంచి గుర్తింపును సాధించింది. 2025 టయోటా హైలక్స్ కి ANCAP (ఆస్ట్రేలియా న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) నుంచి పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. హైలక్స్‌పై చేసిన ANCAP పరీక్షలు ప్రమాదాల సమయంలో రక్షణతో పాటు, ప్రమాదం జరగకుండా చేసే సిస్టమ్‌ల పనితీరును కూడా పరిశీలించాయి. పెద్దల…