మలయాళ చిత్రాలు ఇప్పుడు తెలుగులో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. అంతే కాదు… కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పుంజుకోవడంతో పలు చిత్రాలు డబ్బింగ్ కూడా అవుతున్నాయి. మొన్నటి వరకూ మలయాళ అనువాద చిత్రాలంటే మోహన్ లాల్, మమ్ముట్టి, సురేశ్ గోపీవే! కానీ ఇప్పుడు పృధ్విరాజ్, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్ చిత్రాలూ ఓటీటీలో వస్తున్నాయి. అలానే ‘వైరస్, లుకా, ఫోరెన్సిక్, కాలా’ వంటి అనువాద చిత్రాలతో తెలుగువారికి చేరవయ్యాడు మరో మలయాళ నటుడు టివినో థామస్.…
టోవినో థామస్ హీరోగా నటించిన సూపర్ హీరో మూవీ ‘మిన్నల్ మురళి’. జైసన్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఓ సాధారణ వ్యక్తి నుంచి అతింద్రీయ శక్తులను సాధించిన సూపర్ హీరో (మురళి) కథే ‘మిన్నల్ మురళి’. ఈ చిత్రాన్ని సోఫియా పాల్ వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ మీద నిర్మిస్తుండగా, బసిలో జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మాలీవుడ్ ఐకాన్ టోవినో థామస్ సూపర్ హీరో మిన్నల్ మురళి పాత్రను…
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత తరఫున పాల్గొని తొలి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో భారత్ కు దక్కిన తొలి స్వర్ణమిది. అంతేకాదు అధ్లెట్స్ విభాగంలోనూ భారత్ ఒలింపిక్స్ లో అందుకున్న మొట్టమొదటి బంగారు పతకం ఇది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. దక్షిణాదిలో చిరంజీవి, మోహన్ బాబు, మహేశ్ బాబు, మోహన్ లాల్, ఎస్.…
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కారణంగా పరభాషా చిత్రాలను మాతృభాషలో చూడగలిగే అదృష్టం తెలుగు సినిమా ప్రేమికులకు లభిస్తోందంటే అతిశయోక్తి కాదు. నిజానికి కొన్ని చిత్రాలను కమర్షియల్ యాస్పెక్ట్ లో నిర్మాతలు డబ్ చేయడానికి తటపటాయించే సమయంలో ఆహాలో వాటిని చూడగలగడం అదృష్టం అనే చెప్పాలి. తాజాగా ఆహా ఓటీటీలో టొవినో థామస్ కాలా చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. దాని గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషిలో మంచి, చెడు గుణాలు కలబోసి ఉంటాయి. ఒక్కో సమయంలో ఒక్కో…
టొవినో థామస్, సుమేశ్ మూర్ ప్రధాన పాత్రలు పోషించిన అవెయిటెడ్ యాక్షన్ డ్రామా ‘కాలా’ జూన్ 4న ఆహాలో విడుదల కానుంది. ఈ యేడాది మార్చి 25న ‘కాలా’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. సాధారణ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఓ హింసాత్మక ఘటనలో చనిపోయిన కుక్క కారణంగా ఇద్దరు వ్యక్తుల నడుమ సాగే భావోద్వేగ సంఘటనల సమాహారమే ‘కాలా’. ఓ కుక్క కారణంగా మొదలైన వివాదం చినికి చినికి గాలీవానగా మారుతుంది. ప్రారంభం నుండి…
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. అందులో వచ్చే నెల జూన్ 4న టొవినో థామస్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ డ్రామా ‘కాలా’ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఓ హింసాత్మక ఘటనలో చనిపోయే కుక్క కారణంగా ఇద్దరి వ్యక్తుల మధ్య ఆసక్తికరమైన భావోద్వేగాలతో నడిచే కథే ‘కాలా’. టొవినో థామస్, సుమేష్ మూర్, దివ్యా పిళ్లై, లాల్…