ప్రపంచవ్యాప్తంగా అత్యంత విశ్వసనీయ నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీని అభివర్ణించిన బీజేపీ.. శుక్రవారం (సెప్టెంబర్ 15) ఆయన నాయకత్వాన్ని కొనియాడింది. జీ-20 సదస్సు ముగిసిన తర్వాత ఈ సర్వే నిర్వహించగా.. ఇందులో ప్రధాని మోడీ అత్యధిక రేటింగ్ పొందారు. మార్నింగ్ కన్సల్ట్ తాజా సర్వేలో.. 76 శాతం మంది ప్రజలు ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఆమోదించారని తెలిపింది.