ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచారు. మరోవైపు.. రాష్ట్రంలో అధికారుల బదిలీలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి. వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అతడిని ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు కట్టబెట్టొద్దని, తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.