మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారు.. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేశారు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. మీరంతా విజేతలు.. మీకు హ్యాట్సాఫ్.. మీ అందరితో ఇలా కూర్చోవడం నా అదృష్టం.. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాని భావోద్వేగానికి గురయ్యారు. ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యనభ్యసించి మార్కుల్లో రాష్ట్రస్థాయి టాపర్ లుగా నిలిచిన 52…