ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మార్చి నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.. ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే…