ఎల్లుండి తెలంగాణకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్..! తెలంగాణ రాష్ట్రానికి ఎల్లుండి (జూన్ 19న) కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాబోతున్నారు. ఇక, కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో వారికి స్వాగతం పలికేందుకు భారతీయ జనతా పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తుంది. భారీ ర్యాలీతో పాటు బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో…
చిన్నారిపై అత్యాచార ఘటన.. మంత్రులు సీరియస్ చిన్నారిని చిదిమేసిన నిందితున్నీ వదిలేది లేదని మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష విధిస్తామన్నారు. రైస్ మిల్లులో పని చేస్తున్న వారి పై వివరాలు తెలుసుకునేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరీయస్ గా ఉందన్నారు. ఇలాంటి సంఘటనల…
ముస్తాబౌతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక సిద్ధమవుతోంది. సభా వేదిక పనులు దగ్గరుండి అధికారులు, టీడీపీ నాయకులు పరివేక్షిస్తున్నారు. ఈనెల 12వ తేదీ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభా వేదిక నిర్మాణం వద్ద టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక దళాలతో భారీ బందోబస్తు చేసేలా ప్రణాళిక ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను సీఎస్…
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ.. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. గురువారం భారీ వర్షాలతో రాష్ట్ర రాజధాని, పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. ఎస్,ఆర్.నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హయత్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మలక్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్ అంతటా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ ప్రకారం రాత్రి వరకు చెదురుమదురు వర్షాలు…
చంద్రబాబుకు సీఎస్, డీజీపీ శుభాకాంక్షలు సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ రోజు ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు ఏపీ సీఎఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా.. ఇక, చంద్రబాబును కలిసిన వారిలో పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.. మాజీ డీజీపీ ఆర్పీ ఠాగూర్ సైతం కాబోయే ఏపీ సీఎంకు శుభాకంక్షలు తెలిపారు.. బీజేపీ గెలిచిన 8 చోట్ల బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్…
ఉప్పల్ స్టేడియంకు ఐపీఎల్ అవార్డు! ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తుది పోరులో చేతులెత్తేసింది. ఆదివారం చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనన్లో సన్‌రైజర్స్ ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన ఎస్ఆర్హెచ్.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఎస్ఆర్హెచ్ ఓటమితో అభిమానులే కాదు ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్‌కు చిన్న ఓదార్పు దక్కింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు ఐపీఎల్…
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై వివరణ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ అధికారి అధికారిక ముద్ర లేకున్నా.. సదరు బ్యాలెట్ ను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏపై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్‌పై సదరు రిటర్నింగ్ అధికారి…
కాంగ్రెస్ ప్రభుత్వం సందిగ్ధంలో ఉంది.. వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సందిగ్ధంలో ఉందన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులను మోసం చేసి ఇప్పుడు…
బోనస్ ఇచ్చి కొనడానికి మీకు బాధ ఏంటి.. కిషన్ రెడ్డి ఫైర్ బోనస్ ఇచ్చి కొనడానికి మీకు బాధ ఏంటి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతులను మరో సారి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల్ని దగా చేసిందన్నారు. కౌలు రైతులకు 15 వేలు ఇస్తామని చెప్పారు… వరికి క్వింటాల్ కు 500 బోనస్ ఇస్తామని చెప్పి యే ఒకటి కూడా అమలు…
ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా చూస్తాం.. తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఏఎస్డీ లిస్ట్ లో ఉన్న 54 వేల మంది ఓటర్ లిస్ట్ లో 4 వేల మంది మాత్రమే ఓటు వేశారు అని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. బెంగళూరు అర్బన్ లో 30 శాతం ఏ.ఎస్.డి ఉంది.. ఇక, స్ట్రాంగ్ రూంలో ఈవీఏంలు పటిష్ఠమైన భద్రంగా ఉన్నాయి.. చాలా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ చేస్తామని పేర్కొన్నారు. ముందుగా 8 గంటలకు…