టాలీవుడ్ సిని కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. వారం రోజుల్లో ముగుస్తుందనుకున్న ఈ సమ్మె మూడు వారాలుగా సాగుతూనే ఉంది. కానీ పరిష్కారం అయితే లభించలేదు. ఈ నేపధ్యంలో సినీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకోనుంది. నిన్న సినీ కార్మిక సమ్మె పై ఫిల్మ్ ఛాంబర్ తో ఫెడరేషన్ తో చర్చించిన ప్రభుత్వ ఉన్నతాధికారుల పలు సూచనలు చేసారు. ప్రభుత్వం చేసిన సూచనల పట్ల ఫెడరేషన్ నాయకులు సుముఖంగా ఉన్నట్టు సమాచారం.…
కార్మిక సంఘాల సమ్మెతో టాలీవుడ్ స్తంభించింది. ఈ బంద్ పై కొందరు తెలుగు చలన చిత్ర నిర్మాతలు ఇన్ సైడ్ గా మాట్లాడుతూ ’50 ఏళ్ల కిందటి యూనియన్ రూల్స్ తో నేటి పరిస్థితుల్లో నిర్మాతలు సినిమాలు తీయలేరు, వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో ఈ సమ్మెకు ముగింపు పలికేందుకు నిర్మాతలు సాధ్యమైనంతగా స్పందిస్తున్నారు. ఇతర చిత్ర పరిశ్రమల్లో ఉన్నట్లే టాలీవుడ్ లోనూ సినీ కార్మికుల పని గంటలు ఉండాలని నిర్మాతలు కోరుతున్నారు.…
టాలీవుడ్ షూటింగ్ బంద్ వ్యవహారం ఇప్పుడు చిరు ఇంటికి చేరింది. నేడు చిరు ఇంట్లో ప్రొడ్యూసర్స్ Vs ఫెడరేషన్ పంచాయతీ జరగబోతుంది. ప్రొడ్యూసర్స్ అభిప్రాయం తెలుసుకుని వారి ఫైనల్ నిర్ణయం ఏంటనే దానిపై వివరణ తీసుకోబోతున్నారు చిరంజీవి. నేడు ప్రొడ్యూసర్స్ సైడ్ నుండి వివరణ తీసుకుని రేపు ఫెడరేషన్ నాయకులతో చిరంజీవి సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరు వర్గాల అభిప్రాయం తెలుసుకున్న తరువాత మంగళవారం ప్రొడ్యూసర్స్ మరియు ఫెడరేషన్ నాయకులతో మెగాస్టార్ భేటీ అయ్యే ఛాన్స్…