Home
Tollywood News
Tollywood News News
-
‘మా’ ఆసక్తి.. చిరును మీట్ అయిన ప్రకాష్ రాజ్
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జిమ్‌లో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిరుతో తీసుకున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ఈరోజు మార్నింగ్ జిమ్‌లో బాస్‌ని కలిశాను. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం సంతోషంగా ఉంది. మీరెప్పుడూ మాకు స్పూర్తి అన్నయ్య’ అని రాసుకొచ్చారు. కాగా, ఆయన చేతి గాయాన్ని చిరు అడిగి తెలుసుకున్నారు. ప్రకాష్ రాజ్ ఇటీవలే షూటింగ్ లో ప్రమాదానికి గురికావడంతో చిన్న సర్జరీ అయిన… -
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ తాజా అప్డేట్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 13, 2021 విడుదల కానుంది. కాగా, షూటింగ్ ఇంకా సెట్స్ మీదే ఉండటంతో విడుదల ఆలస్యం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, చెప్పిన తేదీకే ఈ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకొచ్చేందుకు రాజమౌళి గట్టిగానే ప్రయాణిస్తున్నారు.… -
తమన్ చేతులు మీదుగా ‘అర్థం’ ఫస్ట్‌లుక్ విడుదల
‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర, శ్రద్ధా దాస్, అజయ్, ఆమని, సాహితీ అవంచ, ‘వైశాలి’ ఫేమ్ నందన్ ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘అర్థం’. ఈ సినిమాను రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ తెరకెక్కింది. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దీనికి రచయిత, దర్శకుడు. ప్రముఖ సంగీత దర్శకులు తమన్… -
‘అనుభవించు రాజా’ అంటున్న రాజ్ తరుణ్!
ఎనిమిదేళ్ళ క్రితం రాజ్ తరుణ్ ను ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో పరిచయం చేశాడు నాగార్జున. ఆ తర్వాత ఐదేళ్ళకు రాజ్ తరుణ్ తోనే ‘రంగుల రాట్నం’ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. మళ్లీ ఇప్పుడు ముచ్చటగా రాజ్ తరుణ్ తో మూడో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు నాగార్జున. హడావుడీ లేకుండా మొదలైన ఆ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందట. 2016లో రాజ్ తరుణ్ హీరోగా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రాన్ని… -
ఈ నెలాఖరులో శ్రీనివాసరెడ్డి, సప్తగిరి ‘హౌస్ అరెస్ట్’!
ప్రముఖ కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు హీరోగానూ పలు చిత్రాలలో నటిస్తున్నాడు. మరికొన్ని సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే శ్రీనివాసరెడ్డి నటించిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రం విడుదలైంది. ‘ప్లాన్ బి’ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో అతను కీలక పాత్ర పోషించిన మరో సినిమా ‘హౌస్ అరెస్ట్’ ఈ నెల 27న విడుదల కాబోతోంది. సినిమా పంపిణీ రంగంలో ఉన్న కె. నిరంజన్ రెడ్డి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, తొలియత్నంగా ‘హౌస్ అరెస్ట్’… -
ఆది సాయికుమార్ ‘కిరాతక’ ఏమైనట్టు!?
ఆది సాయికుమార్ హీరోగా, వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ‘కిరాతక’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో కొన్ని నెలల క్రితం నాగం తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఆది సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోందంటూ కొద్ది రోజుల క్రితం పోస్టర్స్ నూ రిలీజ్ చేశారు. అంతేకాదు… ఆగస్ట్ 13 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలవుతుందని, పూర్ణ ఇందులో పోలీస్ అధికారిగా కీలక పాత్ర పోషించబోతోందని ప్రకటించారు. కానీ ఆగస్ట్ 13న ఆ సినిమా… -
సీఐ కేశవ్ నాయుడుగా ధన్‌రాజ్! పోస్టర్‌ను రిలీజ్ చేసిన సందీప్ కిషన్
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘బుజ్జి ఇలా రా’. సైకలాజికల్ థ్రిల్లర్.. అనేది మూవీ ట్యాగ్‌లైన్. దీనిని బట్టే సినిమా జానర్ ఏమిటనేది అర్థమవుతుంది. చాందిని అయ్యంగార్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ కొద్ది రోజుల క్రితం విడుదలై, మంచి స్పందనను రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమాలో సీఐ కేశవ్ నాయుడు పాత్రలో నటిస్తున్న ధన్‌రాజ్ పాత్రకు సంబంధించిన లుక్‌ను ప్రముఖ హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు. ‘గరుడవేగ’ అంజి… -
వివరణ సంతృప్తికరం.. సర్దుకున్న నటి హేమ ఎపిసోడ్
ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని నటి హేమ ఆరోపించడంతో టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. నిధులను దుబారా చేస్తున్నారని, రూ. 5 కోట్లలో రూ. 3 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. హేమ ఆరోపణలపై నరేశ్‌తో పాటు ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ తీవ్రంగా తప్పుపట్టారు. ‘మా’ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడిందని క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ చేయడంతో హేమకు నోటీసులు జారీ అయ్యాయి. ఆమెను వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ… -
అందగాడు వారం వెనక్కి వెళ్ళాడు!
నటుడిగా, దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకుంటోన్న అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 101 జిల్లాల అందగాడు. బట్టతల ఉండే యువకుడు గొత్తి సత్యనారాయణగా అవసరాల శ్రీనివాస్ నటించిన ఈ చిత్రంలో, ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ శర్మ నటించారు. హిలేరియస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, ఎస్వీసీ-ఎఫ్ఈఈ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్,… -
12 కోట్లకు ‘శ్రీదేవి సోడా సెంటర్’ థియేట్రికల్ రైట్స్
సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్, పాటలకు చక్కటి స్పందన లభించింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందట.…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్‌ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!