అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న సందీప్ రెడ్డి వంగా అనూహ్యంగా వార్తల్లోకి వచ్చాడు. నిజానికి స్పిరిట్ సినిమా నుంచి దీపికా తప్పుకుందనే వార్త ముందు వెలుగులోకి వచ్చింది. దానికి దీపికా పెట్టిన కొన్ని కండిషన్స్ కారణమని కూడా అన్నారు. దీపికా పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమెను ప్రాజెక్టు నుంచి వెళ్లిపోమని కోరారని, దాంతో ఆమె వెళ్లిపోయిందని బయటకు తెలిసింది. అంతేకాదు, అనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ లాంటి పాత్రలో బోల్డ్ క్యారెక్టర్లో…
ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు 2019 ఎన్నికల సమయంలో తనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం, జస్టిస్ బీ.వీ. నాగరత్న నేతృత్వంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15, 2025కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 2019 సాధారణ ఎన్నికల సమయంలో మంచు విష్ణు ఎన్నికల నీతి నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసు…
మంచు మనోజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఈ రోజు నుంచి మీడియాతో ముచ్చటించిన క్రమంలో, భైరవం సినిమా షూటింగ్ విశేషాలు పంచుకున్నారు. నిజానికి, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తన వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయని, మొదట్లో ఆ సంఘటనల వల్ల షూటింగ్ విషయంలో ఇబ్బంది అవుతుందేమో అనుకున్నానని అన్నారు. కానీ, ఆ విషయంలో తన స్నేహితుడు నారా రోహిత్‌ను చూసి తాను ప్రేరణ పొందానని చెప్పుకొచ్చారు. Also…
VI Anand : యూనిక్ సినిమాలు చేస్తాడనే పేరున్న దర్శకుడు వి.ఐ. ఆనంద్ చివరిగా ఊరి పేరు భైరవకోన సినిమా చేశాడు. ఆ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ క్రమంలో సీక్వెల్ ఎప్పుడు వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. అయితే, ఇప్పుడు ఆయన మరో సోషియో-ఫాంటసీ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కేవలం తెలుగు ఆడియన్స్ కోసం కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు…
అక్కినేని నాగచైతన్య చివరిగా "తండేల్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో ఆయన సూపర్ హిట్ కొట్టడమే కాకుండా, వంద కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల హీరోగా కూడా మారాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా నాగచైతన్యకు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తీసుకొచ్చింది.
భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భైరవం’. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలు. ఈ సినిమాను మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సినిమా టీం తెలిపింది. కాగా.. ప్రస్తుతం టీమ్ ప్రమోషన్లో భాగంగా బిజీగా మారింది. అందులో భాగంగానే ఓ వీడియోను విడుదల చేసింది.
Anurag Kashyap : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇప్పుడు నటుడిగా మారిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆయన.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస మూవీల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఆయన తాజాగా విజయ్ సేతుపతిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను కావాలని నటుడిగా మారలేదు. అనుకోకుండా అయ్యాను. సౌత్ లో నాకు చాలా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా…
Pan India Movies : మన దేశంలో ప్రజలపై సినిమాల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలిసిందే. అది మంచి అయినా.. చెడు అయినా.. సినిమాలను చూసి టీనేజ్, యూత్ బాగా ఫాలో అవుతుంది. ఈ విషయం ఎన్నో సార్లు ప్రూవ్ అయింది. అలాంటప్పుడు టాలీవుడ్ నుంచి మెసేజ్ ఉన్న సినిమాలు రావాలని అంతా కోరుకుంటున్నా.. ఇప్పుడు అలాంటి సినిమాలే కరువయ్యాయి. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేశ్,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరి హర వీరమల్లు'. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం హరి హర వీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ తో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే మొదటి భాగానికి సంబంధించి…
Venkatesh : విక్టరీ వెంకటేశ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. మొన్ననే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి హిట్ కొట్టాడు. దాని తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తారనే ప్రచారం ఉంది. అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నేను మొదటి నుంచి ఆధ్యాత్మికతను ఎక్కువగా పాటిస్తాను. తమిళ స్టార్ హీరో రజినీకాంత్ కూడా ఇలాగే ఆధ్యాత్మికతను ఎక్కువగా పాటిస్తుంటారు. నేను సినిమాల్లోకి వచ్చిన మొదట్లో రజినీకాంత్ తో ఎక్కువగా…