Rithika Nayak : తేజసజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాతోనే రితిక నాయక్ బాగా హైలెట్ అవుతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ మూవీ గనక హిట్ అయితే తన కెరీర్ మారిపోతుందనే నమ్మకంతో ఉంది ఈ హీరోయిన్. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి అంతా వెతుకుతున్నారు. ఈమె పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. ఆ తర్వాత ముంబైలో చదువుకుంది. గ్రాడ్యుయేషన్ చేసిన ఈ బ్యూటీ.. ముంబైలో మోడలింగ్ చేసింది. మోడలింగ్ రంగంలో కొన్నాళ్ల పాటు చేసిన తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ లో పెద్దగా ఛాన్సులు రాలేదు. ఆ టైమ్ లోనే తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్-9లో శృంగార తార.. ఎవరీ ఫ్లోరా సైనీ
మొదటి మూవీతోనే మంచి గుర్తింపు పొందింది. అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించడం ఆమెకు కలిసొచ్చింది. దాని తర్వాత రవితేజ హీరోగా వచ్చిన ఈగల్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. కానీ అది పెద్దగా గుర్తింపు తేలేదు. ఇప్పుడు తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. పైగా ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది. ఇది గనక హిట్ అయితే తెలుగులో తనకు మంచి అవకాశాలు వస్తాయనే ఆశతో ఉంది. ప్రస్తుతం తెలుగులో అంత పాపులారిటీ ఉన్న కొత్త హీరోయిన్లు కరువయ్యారు. అందుకే ఆ స్థానం కోసం ఈ బ్యూటీ ఆశపడుతోంది. చూడాలి మరి మిరాయ్ ఆమె కెరీర్ ను నిలబెడుతుందో లేదో.
Read Also : Shivani Nagaram : శివానీ నగరం ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిందని తెలుసా..?